calender_icon.png 16 December, 2025 | 7:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దశాబ్ద కాలం నాటి తునికి చెట్టు కనుమరుగు..!

13-12-2025 12:26:16 AM

కేసముద్రం, డిసెంబర్ 12విజయక్రాంతి: అనేక సంవత్సరాలుగా మహబూబాబాద్ జిల్లా కేసము ద్రం పట్టణంలో కొన్ని వ్యాపా ర సముదాయాలకు ల్యాండ్ మార్క్ గా నిలుస్తున్న దశా బ్దాలకాలం నాటి తునికి చెట్టు కనుమరుగు కానుంది. మార్కెట్ రహదారిలో రోడ్డు పక్క నే సుమారు 80 ఏళ్లుగా ఉంటున్న తునికి చెట్టు ఆ ప్రాంతంలో అనేక షాపులకు ల్యాం డ్ మార్క్ గా నిలిచేది. ఎవరికైనా తమ చిరునామా చెప్పాలంటే మార్కెట్ రోడ్లో పెద్ద తునికి చెట్టు పక్కనే మా షాపు ఉంటుందని చెప్పుకునే వారు. అలాంటి చెట్టు ఇప్పుడు రో డ్డు విస్తరణలో భాగంగా తొలగింపుకు గురవుతోంది.

ఇకనుండి తమకు చెప్పుకునే పరి స్థితి లేదని ఆ పరిసర ప్రాంతాల్లోని షాపుల యజమానులు వాపోతున్నారు. అలాగే చె ట్టు తొల గింపు దృశ్యాన్ని చూసిన ప్రతి ఒక్క రూ అ య్యో చిన్నతనం నుండి ఈ చెట్టును చూ స్తున్నాం.. చెట్టును తొలగిస్తున్నారా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ వెళ్తున్నారు. ఈ చెట్టు తో పాటు ఇదే మార్గంలో చాలా ఏళ్ల తరబడి నీడనిస్తున్న వట వృక్షాలను సైతం రోడ్డు విస్తరణ కోసం తొలగించారు. నగరికరణ నేపథ్యంలో చాలా ఏళ్ల క్రితం నాటి చెట్లను తొలగించిన ప్రాంతాల్లో మొక్కలు నాటి పెంచాలని కోరుతున్నారు.