15 April, 2026 | 12:52 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

జొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభం

14-04-2025 01:49 AM

క్వింటాలుకు మద్దతు ధర రూ. 3,371

ఎకరాకు  8 క్వింటాళ్ల 65 కేజీల కొనుగోలు 

విండో చైర్మన్ హనుమంత్ రెడ్డి

పెద్ద కొడప్గల్, ఏప్రిల్ 13 (విజయ క్రాంతి), కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండల కేంద్రం ప్రాథమిక సహకార సంఘం లో ఆదివారం జొన్నల కొనుగోలు కేంద్రాన్ని, పి ఎస్ సి ఎస్ చైర్మన్ కె, హనుమంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జొన్న పంటను సాగు చేసిన రైతులు చాలా రోజులుగా ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేయాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు మార్క్ ఫెడ్ జిల్లా అధికారుల ఆదేశాల మేరకు వ్యవసాయ సహకార సంఘం పెద్ద కొడప్గల్ ఆధ్వర్యంలో  జొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించామని తెలిపారు.

క్వింటాలుకు ప్రభుత్వ మద్దతు ధర రూ: 3,371 లతో ఎకరాకు 8  క్వింటాళ్ల 65 కేజీల వరకు కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. రైతుల వద్ద ఉన్న పూర్తి పంటను కొనుగోలు చేసే వరకు కేంద్రాల నిర్వహణ కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ నాగిరెడ్డి, హనుమయ్య, కిషన్, దస్తా రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి, ఏ ఈ ఓ రాజ్యలక్ష్మి, రూప , సహకార సంఘం కార్యదర్శి బి, సందీప్ కుమార్, కాంగ్రెస్ మండల సీనియర్ నాయకులు చిప్ప మోహన్, డాక్టర్ సంజీవ్, సంఘం సభ్యులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.