14-04-2025 01:49:27 AM
హనుమకొండ, ఏప్రిల్ 13(విజయక్రాంతి): హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఈ నెల 27న నిర్వహించే బీఆర్‌ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు ఎట్టకేలకు పోలీసులు అనుమతి మంజూరు చేశారు. ఈ మేరకు వరంగల్ కమిషనరేట్ పోలీసులు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇదే విషయాన్ని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతారావు తెలిపారు.
బీఆర్‌ఎస్ నిర్వహించే రజతోత్సవ సభకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు కెప్టెన్ వెల్లడించారు. 1000 ఎకరాలలో నాలుగు చోట్ల వాహనాల కోసం పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నట్టు పేర్కొన్నారు. సభ ఏర్పాట్లను, పార్కింగ్ రూట్ మ్యాప్ లను పరిశీలించి సభకు వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.