calender_icon.png 22 January, 2026 | 4:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏడుకొండలవాడా క్షమించు..

23-09-2024 02:02:50 AM

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష

హైదరాబాద్, సెప్టెంబర్ 22 (విజయక్రాం తి): తిరుమల శ్రీవారి లడ్డు అపవిత్రం కావడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆవేదనకు గురయ్యారు. ఏడుకొండలవాడా క్షమించు అంటూ ఆదివారం గుం టూరు జిల్లా నంబూరులోని దశావతార వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. భక్తులు ఎంతో పవి త్రంగా భావించే తిరుమల లడ్డు ప్రసాదంలో జంతు అవశేషాలను కలపడం  బాధాకరమన్నారు. గత పాలకుల వికృత పోకడలతో ప్రసాదం అపవిత్రమైందన్నారు. ఈ అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్క రూ ప్రాయశ్చిత్తం చేసుకోవాలని పవన్ వ్యాఖ్యానించారు. అందుకే తాను ప్రాయశ్చి త్త దక్ష చేయాలని సంకల్పించినట్లు పేర్కొన్నా రు. పవన్ 11 రోజుల పాటు దీక్షను కొనసాగించి.. ముగిసిన తర్వాత తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.