calender_icon.png 22 January, 2026 | 4:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నియామకం

22-01-2026 03:15:34 PM

లక్షేట్టిపేట టౌన్, (విజయక్రాంతి): మాదిగ అడ్వకేట్స్ అసోసియేషన్(MAA ) ఉత్తర తెలంగాణ అధ్యక్షులుగా లక్షేట్టిపేటకు చెందిన న్యాయవాది కుడెల్లి అశోక్ ను నియమిస్తూ మాదిగ అడ్వకేట్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కొమ్ము ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 21న ప్రవీణ్ ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ కోర్టుకు వచ్చిన సందర్బంగా ఈ నియామకం ఉత్తర్వు లెటర్ ఇచ్చినట్టు అశోక్ తెలిపారు. ఈ సందర్బంగా అశోక్ మాట్లాడుతూ ఉత్తర తెలంగాణ పరిధిలో ఉన్న మాదిగ న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి, అదే విధంగా వారి సంక్షేమం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.