22-01-2026 03:17:20 PM
బెజ్జూర్ జనవరి 22 (విజయక్రాంతి): కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం లోని అయినమ్ గ్రామ సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడిపోవడంతో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇట్టి విషయం గమనించిన స్థానిక ప్రయాణికులు దాహెగాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ద్విచక్ర వాహనం కింద పడిపోవడంతో తలకు బలమైన గాయాలైనట్లు రక్తం రోడ్డుపై మరకలు ఏర్పడ్డాయి. పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని విచారణ చేపడుతున్నట్లు తెలిపారు.