calender_icon.png 13 August, 2025 | 11:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేతల అరెస్టులకు ఇల్లెందులో బీఆర్ఎస్ నిరసన

05-12-2024 05:07:03 PM

ఇల్లెందు,(విజయక్రాంతి): నియోజక వర్గం టేకులపల్లి తెలంగాణ ఉద్యమ నాయకుడు, సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావును అక్రమ అరెస్టు చేశారని నిరసిస్తూ గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలోని జగదాంబ సెంటర్ లోని తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్టీ ఫౌండర్ సిలి వేరి సత్యనారాయణ  ఆధ్వర్యంలో పట్టణ, మండల ముఖ్య నాయకుల కమిటీతో కలిసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ సందర్భంగా సిలీవెరీ సత్యనారాయణ, మండల అధ్యక్షులు శీలం రమేష్ గారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగాడుతూ ప్రజల తరఫున పోరాటం చేస్తున్న హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డినీ అక్రమంగా అరెస్టు చేస్తున్నారన్న విషయం తెలుసుకున్న సిద్దిపేట ఎమ్మెల్యే  హరీష్ రావు  కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకోగా అక్కడ మాహరీష్ రావునీ అరెస్టు చేయడం అక్రమమని అన్నారు. ప్రజల తరఫున పోరాటం చేస్తున్న బిఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెడతామంటే అదిరేది, బెదిరేది లేదు అంటూ హెచ్చరించారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని అడుగడుగున ప్రజాక్షేత్రంలో నిలదీస్తూనే ఉంటామన్నారు.

ప్రజలలో తమ ఉనికిని కోల్పోయి పేలగా మారిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితిలో ఉందని, కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా ఆ విషయం పూర్తిగా అవగతం అవుతుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రజా పాలన చేస్తున్నామని గొప్పగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్టుల పాలన చేస్తూ పోలీసులతో రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నదని అన్నారు. ప్రశ్నిస్తే దాడుల పేరుతో అక్రమ నిర్బంధాలు చేస్తుందని అన్నారు.ఇంకా ఇన్ని రోజులు ఇలా మా బిఆర్ఎస్ నాయకులు అరెస్టులతో కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తుంది అని మొదటగా ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసి చిత్తశుద్ధి చాటుకోవాలని గుర్తు చేశారు.

అక్రమ అరెస్టులకు తలక్కేది లేదని ఇప్పటికే సంవత్సరకాలం అరెస్టులతోని అక్రమ నిర్బంధాలతోనే సరిపోయిందని ప్రజలు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయి తెలంగాణకు కేసిఆర్ పాలనై శ్రీరామరక్ష అంటూ ఆనాటి రావణుడు రావణుడిపై ఏ విధంగా అయితే శ్రీరాముడుతో కలిసి రామదండు దండయాత్ర చేశారో తిరిగి ప్రజలు అదే విధంగా రావణ కాష్టాన్ని తలపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పై రామదండులాగా విరుచుకుపడతారని అది కొద్దిగా కాలంలోనే అది నిరూపితం అవుతుందని ఆనాడు ఈరోజు ఎవరెవరైతే అత్యుత్సాహం ప్రదర్శించారో వారందరికీ వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు.