22 August, 2026 | 5:04 AM

అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలి

23-05-2024 01:52 AM

జడ్పీ చైర్‌పర్సన్ సరిత 

వనపర్తి (గద్వాల), మే 22 (విజయక్రాంతి): అర్హులందరికీ సంక్షేమ పథ కాలు అందించడంతో పాటు అభివృద్ధి పను లు సకాలంలో పూర్తయ్యేలా చొరవ తీసుకోవాలని జడ్పీ చైర్‌పర్సన్ సరిత అధికారులను కోరారు. బుధవారం గద్వాలలోని పాత ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ.. హరితహారంలో భాగంగా వర్షాకాలంలో మొక్కలను నాటేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. గ్రామాల్లో మౌలిక వసతులు కల్పనకు చర్యలను తీసుకోవాలని సూచించారు. జిల్లాలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని తెలిపారు. వైస్ చైర్‌పర్సన్ సరోజమ్మ, సీఈవో కాంతమ్మ, జడ్పీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.