calender_icon.png 27 January, 2026 | 7:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిరంజీవి వ్యాఖ్యలపై గాయని చిన్మయి స్పందన

27-01-2026 05:22:32 PM

ప్రముఖ తెలుగు నటుడు చిరంజీవి సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ సంస్కృతి లేదని కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై గాయని చిన్మయి శ్రీపాద స్పందించారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ బహిరంగ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి అలాంటి కాస్టింగ్ కౌచ్ సంస్కృతి ఏమీ లేదని, అది వ్యక్తిగతమైన విషయమని చెప్పి, బాధితులపైనే నింద మోపారు. దీనికి ప్రతిస్పందనగా చిన్మయి తన సొంత అనుభవాలను, ఇతరులు పంచుకున్న అనుభవాలను ఉదహరిస్తూ ఆయన వాదనను ఖండించారు. కాస్టింగ్ కౌచ్ అనేది ఈ రంగంలోకి ప్రవేశించే చాలా మంది మహిళలను ప్రభావితం చేసే ఒక నిరంతర సమస్య అని అభివర్ణించారు.

చిన్మయి తన ఎక్స్ పోస్ట్‌లో కొన్ని నిర్దిష్ట సంఘటనలను పంచుకున్నారు, అందులో పని నిమిత్తం భారతదేశానికి వచ్చిన ఒక మహిళపై జరిగిన దాడి కథ కూడా ఉందని, చిన్మయి ఇలా రాశారు, "కాస్టింగ్ కౌచ్ విపరీతంగా ఉంది, మహిళలు కమిట్ మెంట్ ఇవ్వకపోతే కొత్త వారికి పాత్రలు రావు. ఈ పదం చలనచిత్ర పరిశ్రమలో పూర్తిగా భిన్నమైన అర్థాన్ని ఇస్తుంది. ఇప్పుడు అమ్మాయిలు విదేశాల నుండి సినిమా పరిశ్రమలో పనిచేయాలని ఆశిస్తున్నారు. అక్కడ వారికి విస్తృత ప్రపంచ దృక్పథం ఉంటుంది, వారు ఉన్నత విద్యావంతులు, ఇక్కడ ఏమి జరుగుతుందో వారికి తెలుసు.

గతంలో ఓ ప్రముఖ సింగర్ ఇండస్ట్రీలో ఎదురైన చేదు అనుభవాలకు భయపడి ఈ రంగాన్నేవదిలివెళ్లిపోయిందన్నారు. తాను కూడా గతంలో గురువుగా భావించిన వ్యక్తి లైంగికంగా వేధించడాన్ని, తన తల్లి పక్కన ఉండగానే అతను తనతో తప్పుగా ప్రవర్తించడాని చిన్నయి అసహనం వ్యక్తం చేశారు. చిరంజీవి ఓ లెండర్ అని, ఆయన తరంలో నటీనటులంతా ఒకరితో ఒకరు స్నేహభావంతో ఉండేవారని, పరస్పరం గౌరవించుకునే వారని ఆమె అన్నారు. ఇటీవల విడుదలైన మన శంకరవరప్రసాద్ గారు సక్సెస్ మీట్ లో మెగాస్టార్ చిరంజీవి సినీ పరిశ్రమ గురించి మాట్లాడారు. ఈ పరిశ్రమ ఒక అద్దం లాంటిదని, మనం ఎలా ఉంటామో అలాంటి ఫలితమే వస్తుందన్నారు. ఎవరైనా సరే సినీ ఇండస్ట్రీలోకి వస్తానంటే వారిని ప్రోత్సహించాలని, ఇది గొప్ప ఇండస్ట్రీ అని తెలిపారు.