27 April, 2026 | 10:36 AM

గిరిజన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి

09-12-2024 07:39 PM

ఐటిడిఏపిఓ రాహుల్...

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న గిరిజన విద్యార్థినీ, విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించి ఉద్దీపకం బుక్లెట్స్ ద్వారా విద్యార్థిని విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించేలా సంబంధిత స్పెషలాఫీసర్లు హెచ్ఎం, వార్డెన్, సబ్జెక్ట్ టీచర్లకు సూచిస్తూ ఉండాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు. సోమవారం నాడు ఐటిడిఏ సమావేశ మందిరంలో నిర్వహించిన గిరిజన దర్బార్ లో యూనిట్ ఆఫీసర్ల సమక్షంలో వివిధ మారుమూల ప్రాంత ఆదివాసి గిరిజన గ్రామాల నుండి వచ్చిన గిరిజనుల నుండి ఆయన అర్జీలు స్వీకరించి, తన పరిధిలో ఉన్నవి వెంటనే పరిష్కరించి, మిగతా వాటిని సంబంధిత అధికారులకు పంపుతూ అర్హులైన ప్రతి గిరిజనులకు ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు అందే విధంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన ఆదేశించారు.

ఎక్కువ శాతం అర్జీలు పోడు భూముల సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, ట్రైకర్ రుణాలు, పట్టా భూములకు విద్యుత్ సౌకర్యం కల్పించుట కొరకు, జీవనోపాధి పెంపొందించుకోవడానికి వ్యక్తిగత రుణాలు ఇప్పించుట కొరకు, ఇతర ఆర్థిక ప్రయోజనాల కొరకు, దీర్ఘకాలిక వ్యాధులకు వైద్యం చేయించుట కొరకు, కిరాణా షాపులు, ఏఎన్ఎం పోస్టుల కొరకు, గిరిజనులు అర్జీలు పెట్టుకున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీవో జనరల్ డేవిడ్ రాజ్, ఎస్డిసి రవీంద్రనాథ్, ఈ ఈ ట్రైబల్ వెల్ఫేర్ తానాజీ, ఏవో సున్నం రాంబాబు, ఆర్సిఓ గురుకులం నాగార్జున రావు, ఎస్ఓ భాస్కరన్, ఏపీఓ పవర్ ఏఈ మునీర్ పాషా, డిటి ఆర్ ఓ ఎఫ్ ఆర్ లక్ష్మీ నారాయణ, ఎఫ్  డి సి ఉదయ్ కుమార్, ఎల్ టి ఆర్ మనిధర్, మిషన్ భగీరథ ఏ ఈ ఈ నారాయణరావు, మేనేజర్ ఆదినారాయణ, డిడి ట్రైబల్ వెల్ఫేర్ పర్యవేక్షకురాలు ప్రమీల బాయ్, ఐసిడిఎస్ సూపర్వైజర్ సుశీల, టీచర్ పద్మావతి, జిసిసి మమత, జేడీఎం హరికృష్ణ,హెల్త్ విభాగం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.