26-01-2026 01:30:06 AM
కుమ్రంభీం ఆసిఫాబాద్, జనవరి25 (విజయక్రాంతి): ఈనెల 28 నుం చి 31వ తేదీ వరకు నిర్వహించనున్న తెలంగాణ కుంభమేళాగా భావించే మేడారం జాతరకు స్థానిక డిపో నుండి బస్సులను ఆర్టీసీ అధికారులు ప్రారంభించారు. అధికారికంగా నేటి నుండి ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ ట్రయల్ గా ముందస్తుగా ఆదివారం డిపో టిఐ 3 నిర్మల ప్రత్యేక బస్సు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మేడారం జాతర కు ప్రత్యేక బస్సులకు ట్రయల్‌గా ఆదివారం ఒక బస్సు పంపించినట్లు తెలిపారు. ఇదే విషయంపై డిపో మేనేజర్ రాజశేఖర్ వివరాల వెల్లడిస్తూ ఆసిఫాబాద్ పికప్ పాయింట్ బెల్లంపల్లిలో ఏర్పాటు చేయడం జరిగిందని, బెల్లంపల్లి నుండి 79 ఆసిఫాబాద్ నుండి 10 ప్రత్యేక బస్సులు నేటి నుండి ప్రారంభం అవుతాయన్నారు.
ఆసిఫాబాద్ నుండి బస్సు చార్జీలు 590 రూపాయలుగా నిర్ణయించినట్లు తెలిపారు. మహాలక్ష్మి పథకం వర్తింప చేయడం జరుగుతుందని భక్తులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీలో ప్రయాణం ఎంతో భద్రతతో కూడుకొని సుఖవంతంగా ఉంటుందని తెలిపారు. మేడారం గద్దెల వరకు బస్సులు వెళ్లనున్నట్లు వివరించారు.