calender_icon.png 26 January, 2026 | 12:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి

26-01-2026 01:28:09 AM

కలెక్టర్ కె .హరిత 

కుమ్రం భీం ఆసిఫాబాద్/పెంచికలపేట, జనవరి 25 (విజయక్రాంతి): అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. అస్పిరేషన్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి, డి ఆర్ డి ఓ దత్తారావు తో కలిసి లింగాపూర్, తిర్యాని మండలాల అధికారులతో  తెలంగాణ సామాజిక జీవనోపాదుల  అమలు తీరు, లబ్ధిదారు లకు అందుతున్న సేవలపై సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, జాబ్ కార్డు, రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ తదితర ప్రభుత్వ సేవలను వర్తింప చేసేందుకు అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలని సూ చించారు. లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకోవడం జరుగుతుం దన్నారు. ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. బలహీన వర్గాల జీవనోపాధి మెరుగుపడే విధంగా అన్ని శాఖల అధికారులు పనిచేయాలని తెలిపారు. ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

పక్షుల పరిశీలన..

మండలంలోని ఎల్లూరు గ్రామంలోని  బొక్కెవాగు ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ కె. హరిత ప్రాజెక్టును సందర్శించారు.  బొక్కెవాగు ప్రాజెక్టును సందర్శించిన ఆమె కెమెరాల సహాయం తో వివిధ రకాల పక్షుల వీక్షించి వాటిని గుర్తించారు. ఈ సందర్భంగా ఎల్లూరు గ్రామ సర్పం చ్ చప్పిడి రవీందర్ గ్రామానికి సంబంధించిన పలు సమస్యలను కలెక్టర్ హరిత దృష్టికి తీసుకువచ్చారు.

బొక్కెవాగు ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని, పోర్రు మత్తడి వద్ద బ్రిడ్జి నిర్మించాలని, కట్టపై సీసీ రోడ్డు నిర్మించాలని కోరారు. దీనికి కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో తహ సీల్దార్ తిరుపతి, డీటీ చిన్ను, ఆర్‌ఐ రాజేష్, ఎల్లూరు సర్పంచ్ చప్పిడి రవీందర్, బీజేపీ మండల అధ్యక్షుడు కుకిడే రాజేశ్వర్, అటవీ శాఖ అధికారులు, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.