ఇసుక అక్రమ రవాణాపై స్పెషల్ డ్రైవ్
11-04-2026 12:00 AM
పలు ఇసుక వాహనాలు పట్టివేత
భైంసా, ఏప్రిల్ 10 (విజయక్రాంతి) : బైంసా ప్రాంతంలోని వివి ధ ప్రాజెక్టులు వాగుల నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనా లను పట్టుకున్నట్టు జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. గురువారం రాత్రి బైంసా పోలీసులు నారిశక్తి మహిళా పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వివిధ వాగుల నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలను పట్టుకుని రెవెన్యూ అధికారులకు అప్పగించినట్లు వివరించారు.




