13 May, 2026 | 1:30 AM

ధాన్యం కొనుగోళ్ల వేగవంతంపై ప్రత్యేక దృష్టి

13-05-2026 12:00 AM
  1. సేకరించిన ధాన్యం మిల్లులకు తరలించేందుకు చర్యలు
  2. అధికారుల క్షేత్ర స్థాయి పర్యటనలతో సమస్యల పరిష్కారం

రాజన్న సిరిసిల్ల, మే 12 (విజయక్రాంతి )రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఐకేపీ, ప్యాక్స్, మెప్మా, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుండి సేకరించిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించడానికి, రైతులకు క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు తలెత్తకుండా చేయాల్సిన ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది.ధాన్యం కొనుగోళ్లకు సంబంధిత శాఖల జిల్లా అధికారులతో పాటు, జిల్లాలోని మండలాల ప్రత్యేక అధికారులు, తహశీల్దార్లు, ఇతర సిబ్బంది తమ పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసి, క్షేత్ర స్థాయిలో రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు సూచనలు చేస్తూ, కొనుగోళ్ళ ప్రక్రియ వేగవంతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు,

రైతుల నుండి తూకం వేసి సేకరించిన ధాన్యం మిల్లులకు తరలించేందుకు వాహనాలు అందుబాటులో ఉండేలా చూడాలని,జిల్లాలోని తంగళ్ళపల్లి మండలం అంకుసాపూర్, లక్ష్మీపూర్ గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను మండల ప్రత్యేక అధికారి షర్ఫుద్దీన్, వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి, నూకలమర్రి గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను మండల ప్రత్యేక అధికారి లక్ష్మీరాజం మంగళవారం తనిఖీ చేశారు. 

అలాగే మిగతా మండలాల ప్రత్యేక అధికారులు, మండలాల తహసీల్దార్లు క్షేత్ర స్థాయిలో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో సమన్వయం చేసుకుంటూ ఇబ్బందులు తలెత్తకుండా పర్యవేక్షిస్తున్నారు.