13 May, 2026 | 1:32 AM

ఎడ్ల జోగిరెడ్డి మరణం బీజేపీకి తీరని లోటు

13-05-2026 12:00 AM

మానకొండూరు, మే 12 (విజయ క్రాంతి): తిమ్మాపూర్ మండల కేంద్రానికి చెందిన బిజెపి సీనియర్ నాయకులు, మాజీ జెడ్పిటిసి ఎడ్ల జోగిరెడ్డి అకాల మరణం పై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు . ఎడ్ల జోగిరెడ్డి హైదరాబాదులోని ప్రైవేట్ ఆసుపత్రిలో చి కిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందారు. తిమ్మాపూర్ మాజీ జెడ్పిటిసి ఎడ్ల భాగ్య భర్త ఎడ్ల జోగి రెడ్డి, గతంలో తిమ్మాపూర్ ఎంపీటీసీగా, తెలంగాణ ఉద్యమంలో ఎడ్ల జోగి రెడ్డి క్రియాశీలకంగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర నాయకుని గా, బిజెపి జిల్లా నాయకునిగా కొనసాగుతున్నారు..

తిమ్మాపూర్ మండల ప్రజలకు సుపరిచితుడైన ఎడ్ల జోగి రెడ్డి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. గత రెండు రోజుల క్రితం ఎడ్ల జోగిరెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఎడ్ల జోగిరెడ్డి అకాల మరణం తిమ్మాపూర్ మండలంలో బీజేపీ పార్టీకి తీరని లోటని వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని, సంతాపం వ్యక్తం చేశారు. 

సంతాపం వ్యక్తం చేసిన కరీంనగర్ బిజెపి జిల్లా శాఖ...

బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగా డి కృష్ణారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి బొంతల కళ్యాణ్ చంద్ర, మండల అధ్యక్షులు చింతం శ్రీనివాస్ లు ఎడ్ల జోగి రెడ్డి మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని , విచారాన్ని వ్యక్తం చేశారు.