8 July, 2026 | 1:59 AM

పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి

08-07-2026 12:00 AM

ఎంఎంసీ కమిషనర్ వినయ్‌కృష్ణా రెడ్డి

సికింద్రాబాద్, జూలై 7 (విజయక్రాంతి): మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి,  అదనపు కమిషనర్ (శానిటేషన్) రఘు ప్రసాద్, డిప్యూటీ కమిషనర్ డాకు నాయక్, డీఈ, ఏఈ, రామ్కీ సంస్థ ప్రతినిధులతో కలిసి బేగంపేట ప్రాంతంలో పారిశుద్ధ్య నిర్వహణ, రహదారులు, ఫుట్పాత్ల పరిశుభ్రతను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా రహదారులు, ఫుట్పాత్లపై ఎలాంటి చెత్త, వ్యర్థాలు పేరుకుపోకుండా ప్రతిరోజూ సమగ్రంగా శుభ్రపరిచే చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

పారిశుద్ధ్య నిర్వహణలో నాణ్యత, వేగం పెంచేందుకు యాంత్రిక శుభ్రపరిచే పరికరాలను సమర్థవంతంగా వినియోగించా లని సూచించారు.అదేవిధంగా ప్రజా ప్రదేశాల్లో నిర్వహించే కార్యక్రమాలు ముగిసిన వెంటనే ఏర్పాటు చేసిన బ్యానర్లు, ఫ్లెక్సీలు, ఇతర ప్రచార సామగ్రిని ఆలస్యం లేకుండా తొలగించి రహదారులు, ఫుట్పాత్లను పరిశుభ్రంగా, అవరోధాలు లేకుండా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం కమిషనర్ సికింద్రాబాద్లోని రైల్ నిలయం కాలనీలో కొనసాగుతున్న రహదారి అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా రహదారుల పక్కన నిర్మాణ, కూల్చివేత వ్యర్థాలు పేరుకుపోవడాన్ని గమనించిన కమిషనర్, వాటిని తక్షణమే తొలగించి శాస్త్రీయ విధానంలో నిర్వర్తించాలని అధికారులను ఆదేశించారు.ప్రజలకు సురక్షితమైన రాకపోకలు కల్పించడంతో పాటు నగర పరిశుభ్రత, సౌందర్య పరిరక్షణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించాలని కమిషనర్ సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు.