calender_icon.png 30 October, 2025 | 2:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీవితంలో క్రీడలు చాలా ముఖ్యమైనవి

29-10-2025 10:53:35 PM

-హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు సర్దార్ దల్ జిత్ సింగ్

-మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థ ఆధ్వర్యంలో క్రికెట్ శిక్షణ తరగతులు

పటాన్ చెరు: జీవితంలో క్రీడలు చాలా ముఖ్యమైనవని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు సర్దార్ దల్ జిత్ సింగ్ అన్నారు. బుధవారం పటాన్ చెరు మండలం ముత్తంగిలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ప్రిన్సిపాల్ రాజేష్ ఆధ్వర్యంలో మాస్టర్ మైండ్స్ క్రికెట్ శిక్షణ కార్యక్రమం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు సర్దార్ దల్ జిత్ సింగ్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ బసవరాజ్, పటాన్ చెరు ఎంఈఓ నాగేశ్వర్ నాయక్, కృష్ణవేణి టాలెంట్ స్కూల్, మాస్టర్ మైండ్స్, ఓక్ లీ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ రాజు సంగాని, సికెఎస్ సీనియర్ కోచ్, ఐపీఎల్ ప్లేయర్ ఖాజా హాజరయ్యారు.

ప్రారంభోత్సవం సందర్భంగా ఒలింపిక్ జ్యోతిని వెలిగించి పోటీలకు శ్రీకారం చుట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ... క్రీడలు మన జీవితంలో అత్యంత ముఖ్యమైనవి అవి క్రమశిక్షణ, జట్టు భావన, ఓర్పు వంటి విలువలను నేర్పిస్తాయని అన్నారు. విద్యార్థుల శారీరక, మానసిక అభివృద్ధికి క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయి అని తెలిపారు. చైర్మన్ రాజు సంగాని మాట్లాడుతూ.. విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలనే మా యొక్క విద్యాసంస్థల ద్యేయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు.