29-10-2025 10:35:23 PM
భద్రాచలం (విజయక్రాంతి): చీటింగ్ కేసులో నలుగురు వ్యక్తులను భద్రాచలం పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఈ సందర్భంగా భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ముందు హాజరు పరిచారు. ఈ సందర్భంగా ఏఎస్పీ తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి... బూర్గంపహాడ్ మండలం సారపాకలోని భాస్కర్ నగర్ కు చెందిన భూక్య శ్రీరాములు అనే వ్యక్తి బూర్గంపాడు మండలం నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామానికి చెందిన ఎల్ఐసి ఏజెంట్ షేక్ యాకుబ్ పాషా అనే ఎల్ఐసి ఏజెంట్ ద్వారా ఎల్ఐసి పాలసీ కట్టాడు. ఈ తరుణంలో శ్రీరాములు మరణించినట్లుగా నకిలీ మరణ ధ్రువపత్రాలను సృష్టించి ఎల్ఐసి పాలసీ యొక్క రూ.10 లక్షల నగదును క్లైమ్ చేసుకున్నారు.
ఈ విషయాన్ని గ్రహించిన ఎల్ఐసి భద్రాచలం శాఖ బ్రాంచ్ మేనేజర్ చక్రవర్తి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు... చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ చీటింగ్ లో పాలుపంచుకున్న నలుగురు వ్యక్తులు అయిన ఎల్ఐసి ఏజెంట్ షేక్ యాకుబ్ పాషా, సారపాకలోని భాస్కర్ నగర్ కు చెందిన భూక్యరాధ, భూక్య శ్రీరాములు, భూక్య లక్ష్మణ్ లను అరెస్టు చేశారు. అదేవిధంగా రాయల దుర్గారావు, మరి కొంతమంది నిందితుల కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు ప్రారంభించినట్లు ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ తెలియజేశారు. ఈ విలేకరుల సమావేశంలో సీఐ నాగరాజు, పట్టణ ఎస్సై సతీష్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.