calender_icon.png 30 October, 2025 | 2:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లంచం తీసుకుంటూ యాదాద్రి ఆలయ ఉద్యోగి పట్టుబడి

29-10-2025 10:24:07 PM

యాదగిరిగుట్ట (విజయక్రాంతి): ఎట్టకేలకు యాదాద్రి ఆలయం మోస్ట్ వాంటెడ్ ఎంప్లాయ్ ఏఈ రామారావు 1,90,000 ఆలయ కాంట్రాక్టర్ వద్ద లంచం తీసుకుంటూ ఇన్నాళ్లకు రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు దొరికాడు. ఆలయంలో ఎక్కడ కాంట్రాక్టు మంజూరు కావాలన్నా కాంట్రాక్టు పనులు కొనసాగాలన్న లంచం ఇవ్వాల్సిందే, కానీ ఈ విషయాలపై ఎవరు స్పందించరు, ఎవరు కంప్లైంట్ చేయరు, కారణం దీని వెనుక పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారుతాయి అని, అసలు ఉన్నతాధికారులే బినామీ కాంట్రాక్టర్లతో స్వామివారి సొమ్ము కాజేస్తారని స్థానికుల సమాచారం.

అందుకు నిదర్శనం ఎట్టకేలకు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా రామారావు పట్టు పడడం నిజమనిపిస్తుంది. కొన్ని రోజుల క్రితం ఆలయంలో ఏర్పాటు చేసిన ఎల్ఈడి టీవీలలో కోకోకోలా, చెప్పుల అడ్వర్టైజ్మెంట్ విస్తు కల్పించింది. ఒక బట్టల కాంట్రాక్టర్ లీజును రెండు సంవత్సరాలకు పెంచుతూ అనధికారిక ఉత్తర్వులను ఇవ్వడం విస్తు కల్పించింది దీనిపై దేవాదాయ శాఖ మంత్రి కూడా ఎంక్వయిరీ వేయడం చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనా దీని వెనుక ఎవరున్నారు ఎందుకున్నారని కారణాలు తెలియాల్సి ఉంది.