29-10-2025 10:18:10 PM
నిర్మల్ (విజయక్రాంతి): భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన ప్రజలకు సాయంగా నిత్యావసర సరుకులతో కూడిన కిట్లను నెస్లే సంస్థ తరఫున జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ కు బుధవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్లో అందజేశారు. జిల్లాలో వరదల వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద ప్రజలకు సాయం అందించాలనే ఉద్దేశంతో నెస్లే సంస్థ మొత్తం 600 నిత్యావసర సరుకుల కిట్లను అందజేసిందని కలెక్టర్ తెలిపారు. ఈ కిట్లు వరదల కారణంగా నష్టపోయిన కుటుంబాలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని కలెక్టర్ అన్నారు. సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చిన నెస్లే సంస్థ ప్రతినిధులను కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో నెస్లే సంస్థ మేనేజర్ వసీం అహ్మద్, బోస్కో నెట్ ప్రతినిధి సత్యనారాయణ, ధపాస్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.