calender_icon.png 30 October, 2025 | 1:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్షానికి కూలిన ఇల్లు

29-10-2025 10:39:41 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలో బుధవారం తుఫాను ప్రభావంతో కురిసిన వర్షానికి 31వ వార్డులో నిరుపేదలైన నాగమల్ల సోమయ్య ఇల్లు పైభాగం పూర్తిగా కూలిపోయి ధ్వంసమైంది. ఇల్లు పూర్తిగా కూలిపోవడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో సహాయం కోసం ఎదురుచూస్తోంది. మున్సిపల్, రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి నిరుపేదలైన నాగమల్ల సోమయ్య కుటుంబానికి ఇల్లు మంజూరు చేసే ఆదుకోవాలని బస్తీ ప్రజలు వేడుకుంటున్నారు.