calender_icon.png 30 October, 2025 | 2:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రీకౌంటింగ్ చేస్తే తప్పేముంది

29-10-2025 10:26:23 PM

అర్ధరాత్రి లెక్కింపు.. ఫిర్యాదు చేస్తే చేయలేదంటే ఎట్లా

విలేకరుల సమావేశంలో వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి గుద్దేటి శివకుమార్..

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): జిల్లా క్లబ్ ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన తనకు తీవ్రంగా అన్యాయం చేశారని వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి గుద్దేటి శివకుమార్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఒక హోటల్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నియమ నిబంధనలు అంటూ క్లబ్ ఎన్నికల్లో ఏ నిబంధన పాటించలేదని విమర్శించారు. మొత్తం పోలైన ఓట్లకు వచ్చిన ఓట్లకు అస్సలు సంబంధం లేదని ఇది నిబంధనలకు విరుద్ధమని ఫిర్యాదు చేసినప్పటికీ క్లబ్బు ఎన్నికల నిర్వాహకులు అస్సలు పట్టించుకోలేదని విమర్శించారు.

వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా తనకు గెలిచే ఓట్లు వచ్చాయని కావాలని ఓట్ల లెక్కింపు మరో చేయలేదన్నారు. నిబంధన ప్రకారం ఓట్ల లెక్కింపు జరిగేంతవరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. ఎన్నికల నిర్వాహకులు ఇప్పటికైనా తన తీరును మార్చుకోవాలని లేని నెల మరింత ముందుకుపోతామని తెలిపారు. ఈ కార్యక్రమంలోఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గుండా వెంకటేష్, భీమ్ శెట్టి హనుమంతు, హన్మేష్, కలకొండ రాఘవేందర్ తదితరులు ఉన్నారు.