29-10-2025 10:42:35 PM
ప్రతి విద్యార్ధి లక్ష్యాన్ని ఎంచుకుని చదువుకుంటే జీవితంలో సక్సెస్ అవుతారు..
వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్, చైర్మన్ మోషన్ ఐఐటీ జూనియర్ కళాశాల..
హన్మకొండ (విజయక్రాంతి): నయీమ్ నగర్ బ్లీస్ కన్వెన్షన్ హాల్ నందు కోటా రాజస్థాన్ మోషన్ జూనియర్ కాలేజీ ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మోషన్ కాలేజీ చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మాట్లాడుతూ విద్యార్ధి జీవితంలో ఇంటర్ విద్య చాలా కీలకమైనది అని, ఇక్కడ ఏ విద్యార్ధి అయ్యేతే క్రమశిక్షణతో కస్టపడి తమ లక్ష్యాన్ని ఎంచుకొని చదువుతారో ఆ విద్యార్ధి జీవితంలో కచ్చితంగా సక్సెస్ అవుతారని అన్నారు. మోషన్ కాలేజీ మొదటి బ్యాచ్ లో మెడిసిన్, ఐఐటీ సాధించిన ఐదుగురు విద్యార్థులను ఘనంగా సత్కరించి, మెమంటోతో పాటు ప్రతి ఒక్కరికి ప్రోత్సాహంగా 5000/- రూపాయలు కాలేజీయాజమాన్యం అందివ్వడం జరిగింది.
గతంలో వరంగల్ నుండి చాలా మంది విద్యార్థులు ఐఐటీ, మెడికల్ సీట్లు సాధించుట కోసం హైదరాబాద్ లోని కార్పొరేట్ కాలేజీలో అడ్మిషన్స్ తీసుకొని వారు, ఇప్పుడు దేశంలోనే ఐఐటీ, నీట్ కోచింగ్ కోసం అగ్రగామి సంస్థ అయిన మోషన్ రాజస్థాన్ కోటా బ్రాంచ్ హన్మకొండలో స్థాపించడం జరిగిందని అన్నారు. ఇప్పుడు వరంగల్ లోని విద్యార్థులు తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విద్యార్థుల చేసే డాన్సులకు అందరు కేరింతల కొట్టారు, విద్యార్థుల చేసే సాంస్కృతిక కార్యక్రమంలు అందరినీ అలరించారయి. ఈ కార్యక్రమంలో కాలేజీ డైరెక్టర్ పెరుమాండ్ల అనిల్ గౌడ్, ప్రిన్సిపాల్ ముత్యాల సురేష్, కోటా అధ్యాపకులు అనుజ్ కపూర్, ప్రదీప్ పాఠక్, సురేందర్ సాహు, మిథున్, ఇంటర్ అధ్యాపకులు శ్రీనివాస్ రెడ్డి, లాండిగ రమేష్, కాలేజీ స్టాఫ్ తాళ్లపెల్లి రమేష్, మండల రాజు, లక్ష్మణ్, శనిగరపు సుమన్, రచ్చ కుమార్, అరుణ, మౌనిక, కడారి అనిల్,మధు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.