29-10-2025 10:10:30 PM
ఉదృతంగా ప్రవహిస్తున్న నాగసముద్రం వాగులో ఇద్దరు వ్యక్తులు గల్లంతు..
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని నాగనూల్ రోడ్డులో ఉదృతంగా ప్రవహిస్తున్న నాగసముద్రం (నాగనూల్) వాగు ప్రమాదానికి కారణమైంది. నాగనూల్ నుండి నాగర్ కర్నూల్‌కు వస్తున్న ఇద్దరు వ్యక్తులు వాగు దాటే ప్రయత్నంలో నీటి ప్రవాహానికి కొట్టుకుపోయారు. స్థానికులు వెంటనే స్పందించి ఒకరిని రక్షించగా మరొకరు గల్లంతయ్యారు. గల్లంతైన వ్యక్తులిద్దరూ లింగల మండలం అంబటిపల్లికి చెందిన వారిగా సమాచారం. కాకా విషయం తెలుసుకున్న పోలీసులు ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకపోవడం విశేషం.