calender_icon.png 26 August, 2025 | 10:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు

24-04-2025 12:00:00 AM

పోలీస్ సబ్ కంట్రోల్ పున:ప్రారంభించిన ఎస్పీ అఖిల్ 

ఆదిలాబాద్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): జిల్లాలో నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. దీని కోసం పోలీసులు ఎప్పుడు ప్రజల్లో ఉండేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఆదిలాబాద్ బస్టాండ్, పరిసర ప్రాంతాలలో ఎలాంటి నేరాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీస్ సబ్ కంట్రోల్ ను రూమ్‌ను ఎస్పీ బుధవారం పున:ప్రారంభించారు.  అనంత రం ఏఎస్‌ఐ ముకుంద రావుకు సబ్ కంట్రోల్ రూమ్ బాధ్యతలను అప్పగించి, సిబ్బందికి ఎస్పీ పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. బస్టాండ్‌తో పాటు  పరిసర ప్రాంతాలలో చిన్నచిన్న దొంగతనాలు, పిక్ పాకెట్స్, ఈవిటీజింగ్, రోడ్డు ప్రమాదాలు జరగకుండా తక్షణ సహాయం కోసం జిల్లా పోలీసు యంత్రాంగం అందుబాటులో ఉంటుందన్నారు.

ఎలాంటి సమస్యల కైనా క్షణాల వ్యవధిలో స్పందించే విధంగా ఉదయం నుండి రాత్రి వరకు ఒక ఏఎస్‌ఐ, ఒక హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవలందిస్తారని తెలి పారు. బస్టాండ్ వద్ద ఎలాంటి ఆసాంఘిక కార్యకలాపాలను చోటు లేకుండా పర్యవేక్షించే విధంగా పోలీస్ సబ్ కంట్రోల్ ఏర్పాటు చేయ డం జరిగిందని తెలిపారు. అదేవిధంగా  గం జాయి, మాదకద్రవ్యాలను సేవించడం, వ్యా పారం చేయడం, రవాణా లాంటి అంశాలను సిబ్బంది గమనిస్తూ నియంత్రిస్తూ ఉంటుందని తెలిపారు. సబ్ కంట్రోల్ రూమ్‌లో ప్రజ లు అత్యవసర సమయాలలో స్పందించి పోలీసుసేవలను వినియోగించుకోవాలని తెలిపా రు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ జీవన్ రెడ్డి, సీఐలు సిహెచ్ కర్ణాకర్ రావు, సునీల్ కుమార్, ప్రణయ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.