calender_icon.png 27 August, 2025 | 1:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భానుడి ప్రతాపంతో భగభగ..

24-04-2025 12:00:00 AM

  1. నిప్పుల కొలిమిగా మారిన ఆదిలాబాద్ జిల్లా
  2. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. దంచి కొడుతున్న ఎండలు.. 
  3. బయటకు రావడానికి జంకుతున్న జనాలు

ఆదిలాబాద్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి):  ఆదిలాబాద్ జిల్లా నిప్పుల కొలిమిగా మారింది. భానుడి ప్రతాపంతో  జనాలు జంకుతున్నారు.గత వారం రోజులుగా రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో ఎండ లు దంచి కొడుతున్నాయి. ఉపరితల ద్రోని ప్రభావంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రోజురోజుకీ అమాంతంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండల తీవ్రతకు తోడు వడగాలుల దాటికి జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

ఏజెన్సీ పల్లెల్లో పగటి ఉష్ణోగ్రతలు బెంబేలెత్తిస్తుండగా.. వేస వి తాపానికి భూగర్భ జలాలు అమాంతం అడుగంటిపోయి తాగునీటికి ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఏప్రిల్ మాసంలోనే ఎండ లు ఇలా ఉంటే రానున్న మే నెలలో పరిస్థితి ఇంకా ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎండ తీవ్రతకు జనా లు బయటకు రాక పట్టణ రోడ్లన్నీ   కర్ప్యూ నీ తలపిస్తున్నాయి.

ఆదిలాబాద్ జిల్లా మావలలో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమో దు కాగా, తలమడుగు, తాంసి, బేలా, ఇంద్రవెల్లి, నార్నూరులలో 43.5 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో వారం రోజులపాటు ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉం డాలని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. పెరుగుతున్న ఎండలతో వడదెబ్బ బాధితులు సంఖ్య సైతం పెరుగుతోంది. 

కర్ఫ్యూను తలపిస్తున్న రోడ్లు...

రోజురోజుకు ఎండలు ముద్రడంతో ఉద యం 9 గంటలకే బానుడు తన ప్రతాపాన్ని చూపడంతో రోడ్లపైకి జనాలు రావ డం లేదు. పగటిపూట ఉష్ణోగ్రతలు అమంతంగా పెరిగిపో వడంతో ఎండ తీవ్రతను తట్టుకోలేక ప్రజలు ఇంటి నుండి బయటకు రావ డం లేదంటే అతిశయోక్తి కాదు. దీంతో పట్టణ రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనబడుతూ కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తున్నాయి.

అత్యవసర పరిస్థితుల్లో బయటకు వస్తే  అడగాల్పులతో రోడ్డుపై నడవలేక జనాలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఉదయం 9 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు సైతం వేడి కాల్పులు వియడంతో వాతావరణం కాస్త నిప్పుల కొలిమిలా మారుతుంది. ముఖ్యం గా పిల్లలు, వృద్దులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.