03-07-2025 12:03:46 PM
కుమ్రంభీంఆసిఫాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party) రాష్ట్ర అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన రామచందర్ రావు(Naraparaju Ramchander Rao)ను గురువారం హైదరాబాద్ లోని ఆయన నివాసంలో భాజపా సీనియర్ నాయకులు, వన్ నేషన్ వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్ అరిగెల నాగేశ్వరావు పుష్పగుచం ఇచ్చి మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ త్వరలోనే ఆసిఫాబాద్ జిల్లాను పర్యటిస్తానని, పార్టీ అభివృద్ధి కోసం అందరూ కలసికట్టుగా పని చేయాలన్నారు,ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రవేశపెడుతున్న అభివృధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని తెలిపారు,రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో భారీగా పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని సూచించినట్లు తెలిపారు.వఆయన వెంటా భాజపా నాయకులు,తదితరులు ఉన్నారు.