03-07-2025 12:29:55 PM
వలిగొండ, (విజయక్రాంతి): వలిగొండ మండల కేంద్రంలో ని మార్కెట్ యార్డ్ వద్ద భీమలింగం కాలువపై వంతెన నిర్మించేందుకు తాత్కాలికంగా మట్టితో ఏర్పాటు చేసిన డైవర్షన్ రోడ్డు ఇటీవల వర్షాలకు కోతకు గురైంది అనే వార్తను విజయక్రాంతి దినపత్రికలో(Vijaya Kranti Newspaper) ప్రచురించడం జరిగింది. కాగా ఈ వార్తకు అధికారులు స్పందించి డైవర్షన్ రోడ్డుకు పైపులు వేసి కోతకు గురైన ప్రాంతంలో మట్టితో పూడ్చి వేయడం జరిగింది. డైవర్షన్ రోడ్డు సరి చేయడంతో వాహనదారులు విజయక్రాంతి దినపత్రికకు కృతజ్ఞతలు తెలియజేశారు.