03-07-2025 12:15:56 PM
కామారెడ్డి, (విజయక్రాంతి): ప్రపంచ మెకానిక్ డే(World Mechanic Day) సందర్బంగా కామారెడ్డి జిల్లా టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్(Kamareddy District Two Wheeler Mechanic Welfare Association) ఆధ్వర్యంలో గురువారం టూ వీలర్స్ మెకానిక్స్ పాల్గొని మెకానిక్ జెండా ఆవిష్కరణ చేశారు. మెకానిక్ ల ఐక్యత వర్ధిల్లాలని నినాదాలు చేశారు. కేకు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం అధ్యక్షులు కిరణ్ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా మెకానిక్ లా ఐక్యత కోసం పాటుపడతానని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి రాజు మాట్లాడుతూ... మెకానిక్స్ అంటే ప్రాణం లేని మోటర్ వాహనాలకు ప్రాణం పోసే డాక్టర్లమని అన్నారు. ఈ కార్యక్రమంలో మెకానికులు శ్యామ్ రావు, మాచారెడ్డి శ్రీనివాస్, ధనరాజ్, విష్ణు, విజయ్, సంజీవ్, నిజామాబాద్ రాజన్న, రాజేష్, విజయ్, డిచ్పల్లి శ్రీనివాస్, ఇందల్వాయి మనోజ్ జిల్లాలోని మెకానిక్స్ పాల్గొన్నారు.