calender_icon.png 3 July, 2025 | 7:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రాచలంలో స్త్రీలకు గర్భకోశ వ్యాధుల ఉచిత పరీక్షా శిబిరం

03-07-2025 12:51:31 PM

ప్రారంభించిన ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు 

భద్రాచలం, (విజయక్రాంతి): భద్రాచలంలోని చిన్న జీయర్ మఠంలో(Chinna Jeeyar Swamy Ashram) గురువారం స్త్రీలకు గర్భకోశ వ్యాధుల ఉచిత పరీక్ష శిబిరాన్ని నిర్వహించారు. వికాస తరంగణి, లయన్స్ క్లబ్ సంయుక్తంగా ఈ క్యాంపు నిర్వహించగా ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు( MLA Tellam Venkata Rao) పాల్గొన్నారు.  చిన్న జీయర్ మఠం ఆధ్వర్యంలో  తెలుగు రాష్ట్రాలవ్యాప్తంగా ఇప్పటి వరకు 1481 క్యాంపులు నిర్వహించి , 1482 వ క్యాంపు భద్రాచలంలో నిర్వహిస్తున్నారు.  పరీక్షల కోసం  మహిళలు అధిక సంఖ్యలో వచ్చారు. 

35 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ ఈ పరీక్ష చేయించుకోవడం ద్వారా  రాబోయే గర్భకోశ  వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చు అని  తెలిపారు. ఈ కార్యక్రమంలో  భద్రాచలం లయన్స్  క్లబ్ అధ్యక్షురాలు, వికాస తరంగణి అధ్యక్షురాలు  కమల కుమారి,  చినజీయర్  మఠం అధ్యక్షులు  వెంకటాచారీ,  వికాస తరంగిణి జిల్లా అధ్యక్షురాలు రోజా రమణి, గర్భకోశ  వ్యాధుల నిపుణులు  డాక్టర్ మాధవి, డాక్టర్ జయ భారతి,  వికాస తరంగిణి  చక్రవర్తి , లయన్స్ సెక్రెటరీ సిద్ధారెడ్డి, హరిచంద్ర నాయ క్, చారుగుల్ల శ్రీనివాస్ , నాగేశ్వరరావు,  తదితరులు పాల్గొన్నారు.