calender_icon.png 3 July, 2025 | 5:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ సీనియర్ నేత తాళ్లపల్లి ఇక లేరు

03-07-2025 12:21:43 PM

కొత్తపల్లి,(విజయక్రాంతి): బీజేపీ సీనియర్ నాయకులు తాళ్లపల్లి హరికుమార్ గౌడ్(Tallapalli Harikumar Goud Passes Away) గురువారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందడం జరిగింది. తాళ్లపల్లి హరికుమార్ గౌడ్ కి  ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు భార్య ఉన్నారు. హరికుమార్ గౌడ్  గత 35 సంవత్సరాల పైచిలుకు బీజేపీ పార్టీలో క్రియాశీలకంగా పని చేశారు.  బీజేపీ నగర అధ్యక్షుడిగా, కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ గా బాధ్యతలు చేపట్టారు.  మాజీ హోం సహాయక మంత్రి విద్యాసాగర్ రావుకు తాళ్లపల్లి ప్రియ శిష్యులు.

బీజేపీ కరీంనగర్ నగర శాఖ అధ్యక్షులుగా, కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ గా, కోశాధికారిగా వివిధ బాధ్యతలు నిర్వర్తించి పార్టీని బలోపేతం చేసిన తాళ్లపల్లి హరికుమార్ గౌడ్ పరమపదించారన్న విషయం జీర్ణించుకోలేకపోతున్నానని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ఎక్స్ లో పేర్కొన్నారు. వారి పవిత్ర ఆత్మకు సద్గతులు ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటూ వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను.