14 July, 2026 | 4:49 AM

వర్షాల కోసం ప్రత్యేక పూజలు

14-07-2026 01:15 AM

తాడ్వాయి, జూలై, 13( విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం సంతాయిపేట శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో నందివాడ గ్రామస్తులు సోమవారం వర్షాల కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు అందరూ కలిసి శ్రీ భీమేశ్వర స్వామి ఆలయానికి పాదయాత్రతో వెళ్లారు. అక్కడి వాగులో ప్రత్యేక స్నానాలు చేశారు. అనంతరం ప్రత్యేకంగా వంటలు చేసుకుని సహ పక్తి భోజనాలు చేశారు. అంతకుముందు ఆలయానికి వెళ్లి త్వరగా వర్షాలు కురిపించాలని శ్రీ బీజేశ్వర స్వామిని ప్రార్థించారు. వర్షాలు కురువకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని,పంటలు కాపాడాలని భావవంతుణ్ణి ప్రార్తించారు.. ఈ కార్యక్రమం లో గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.