calender_icon.png 26 July, 2025 | 3:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోదాం మైసమ్మకు ప్రత్యేక పూజలు

26-07-2025 01:10:28 AM

పట్టు వస్త్రాలు సమర్పించిన ఆలయ కమిటీ సభ్యుడు మురళీధర్‌రెడ్డి

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 25 (విజయక్రాంతి): నాంపల్లి పటేల్‌నగర్‌లోని  గోదాం మైసమ్మ దేవాలయంలో శుక్రవారం అమ్మవారికి ఆలయ కమిటీ సభ్యుడు కే మురళీధర్‌రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయనను పూలమాలవేసి అభినందించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మా ట్లాడుతూ.. తెలంగాణలో కులగణన బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీ ఆమోదించిన బిల్లును కేంద్రం పెండింగ్‌లో ఉన్న అంశాలపై కాంగ్రెస్ పెద్దలతో సీఎం రేవంత్‌రెడ్డి చర్చించడం ఘనకార్యం అని కొనియాడారు. తెలంగాణలో నిర్వహించిన కులగణన సర్వే దేశవ్యాప్తంగా రోల్ మోడల్‌గా నిలిచిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రశంసించడం గొప్ప విషయమని చెప్పారు.