17 April, 2026 | 11:17 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

ప్రభుత్వ ఆసుపత్రి, సింగరేణి హాస్పిటళ్లలో భద్రతపై ప్రత్యేక నిఘా

12-06-2025 12:27 AM

సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: గోదావరిఖని ఏసీపీ రమేష్

గోదావరిఖని జూన్ 11 విజయ క్రాంతి) గోదావరి ఖనిలో ప్రభుత్వ ఆసుపత్రిని,  సింగరేణి హాస్పిటల్ లలో భద్రత పై ప్రత్యేక నిఘా ఉంచామని ఏసీపీ మడత రమేష్ తెలిపారు. సీ పీ ఆదేశాల మేరకు  గోదావరిఖని ప్రభుత్వ హాస్పిటల్, సింగరేణి ఏరియా హాస్పిటల్ లో భద్రత చర్యలలో భాగంగా సీసీ కెమెరాలు ఏర్పాటు, పనితీరు, భద్రత సిబ్బంది పనితీరు, 

హా స్పిటల్ ల లోని వారడ్స్, పరిసరాలను ఏ సి పి రమేష్ గోదావరిఖని 1-టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి తో కలిసి బుధవారం సంద ర్శించి, పరిసరాలను పరిశీలించి భద్రతా చర్యలపై పలు సూచనలు సలహాలు పాటించాలని, భద్రత పై ఇటీవల ఆసుపత్రి సిబ్బందిపై దాడి జరిగిన సంఘటనల గురించి రాష్ట్రంలోని వివిధ ప్రదేశాలలో ఆసుపత్రుల నుండి పిల్లల కిడ్నాప్ ల గురించి మొదలైన విషయాలపై చర్చించారు.

ఈ సందర్భంగా ఏసీపి  హాస్పిటల్ అధికారులతో సూపరడెంట్స్ తో మాట్లాడుతూ... ప్రభుత్వ, సింగరేణి ఆసుపత్రికి వివిధ ఆరోగ్య సమ స్యలతో ఇతర కారణాలతో చాలామంది వస్తుంటారని, అదేవిదంగా కొంతమంది అనుమానస్పదంగా హాస్పిటల్ ప్రాం తం లలో తిరుగుతుంటారని, గతంలో కొన్ని సందర్భాల్లో పిల్లలను అపహరించడం, చికిత్స జరుగుతున్న సమయంలో ఎవరైనా మరణించిన సందర్భాలలో బంధువులు కుటుంబ సభ్యులు దాడులకు పాల్పడే అవకాశం ఉంటుందని,ముంద స్తు భద్రత,

రక్షణ లో భాగంగా ఆస్పత్రి తప్పనిసరిగా సిసి ఎం ట్రన్స్, ఎగ్జిట్ మెయిన్ రోడ్లపై, ఆస్పత్రి ఎంట్రెన్స్ వద్ద  అదేవిదంగా ఎమర్జెన్సీ వార్డ్, చిల్డ్రన్ వార్డ్, మెటర్నటీ వార్డ్, క్యా జువల్ వార్డ్ లలో, వారడ్స్ ఎంట్రెన్స్, ఎగ్జిట్ ప్రాంతాలలో త ప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ప్రస్తుతం ఉ న్న సీసీ కెమెరాలు పనితీరు ను ఎప్పటికప్పుడు చూడాలని, పని చేయని వాటిని మెయింటైన్స్ చెక్ చేసి పనిచేసే విధంగా చూడాలని  సూచించారు.

హాస్పిటల్ లు అని ప్రాంతాలు పూర్తి స్థాయిలో కవర్ అయ్యే విధంగా నిఘా నీడలో ఉండే విధంగా హై రెజల్యూషన్ కలిగిన కొత్త సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, వాటి పనితీరుపై పూర్తి స్థాయి పర్యవేక్షణ ఉం డాలని,హాస్పటల్ సెక్యూరిటీ సిబ్బంది ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని  ఎవరైనా అనుమానస్పదంగా కనిపించిన ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు హాస్పటల్ పరిసరాలలో జరిగిన వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అం దించాలని సూచించారు. ఈ కార్యక్రమం లో హాస్పిటల్ లఆ ర్‌ఎం ఓలు, సూపరిండెంట్స్, హాస్పిటల్ సిబ్బంది ఉన్నారు.