2 July, 2026 | 2:26 PM

Breaking News

గోండి భాష పరిరక్షణకు కృషి: ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్   •   తంగళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మునిగెల రాజు నియామకం   •   ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం   •   పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం: కేటీఆర్   •   మణికొండ మాజీ వైస్‌ చైర్మన్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు   •   విద్యుత్ షాక్‌తో గేదె మృతి.. రైతుకు రూ.70 వేల నష్టం   •   రోడ్డు ప్రమాదంలో తల్లి కోతి మృతి.. ఒడిని వీడని పసికోతి.. కంటతడి పెట్టించిన ఘటన   •   బ్యాంకులో ఖాతాలపై లాక్‌లు తొలగించాలి   •   కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల డ్రామాలు.. బిగ్ బాస్ షోను తలపిస్తున్నాయ్   •   కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్   •  

పోటీగా సాగిన తైబజార్ వేలం..రూ.6 లక్షలకు పైగా ఆదాయం..

18-03-2026 12:00 AM

సిరికొండ, మార్చి 17 (విజయ క్రాంతి): నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని  సిరికొండ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో తైబజార్ వేలంపాటను సర్పంచ్ సాయిచరణ్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. గ్రామపంచాయతీ ఆదాయ వనరులను పెంపొందించేందుకు నిర్వహించిన ఈ వేలంలో పలువురు ఆసక్తి గల వ్యక్తులు పాల్గొని పోటీగా బిడ్లు వేశారు. తీవ్ర పోటీ మధ్య హమాలి భూమన్న అత్యధికంగా రూ.6,03,200 బిడ్ నమోదు చేసి తైబజార్ హక్కులను దక్కించుకున్నారు.

ఈ వేలం కార్యక్రమం వీడీసీ సభ్యులు, గ్రామపంచాయతీ అధికారులు, ఇతర సభ్యుల సమక్షంలో పారదర్శకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సాయిచరణ్ మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధికి అవసరమైన నిధుల సమీకరణలో ఇలాంటి వేలాల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. ప్రజల సహకారంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు.