సీబీఎస్‌ఈ ఫలితాల్లో ఎస్‌ఆర్ విజయభేరి
సత్తా చాటిన విద్యా సంస్థల విద్యార్థులు
హైదరాబాద్, ఏప్రిల్ 15(విజయక్రాంతి): సీబీఎస్‌ఈ బోర్డు బుధవారం ప్రకటించిన సీబీఎస్‌ఈ టెన్త్ పరీక్ష ఫలితాలలో ఎస్‌ఆర్ విద్యాసంస్థల విద్యార్థులు విజయభేరి మ్రోగించారు. ఎస్‌ఆర్ విద్యాసంస్థలకు చెందిన బొక్క హర్షవర్ధన్(రోల్ నెం.28145278) జాతీయ స్థాయిలో 491/500 మార్కులు సాధించారు. వంగపెల్లి సంహిత(రోల్ నెం.28145399) జాతీయ స్థాయిలో 485/500 మార్కులు, పెంచెల క్షేత్రిక(రోల్ నెం.28145396)జాతీయ స్థాయిలో 482/500, బానోతు వర్షిత్(రోల్‌నెం.28145277) జాతీయ స్థాయిలో482/500 మార్కులు సాధించి ఎస్‌ఆర్ కీర్తి ప్రతిష్ఠను జాతీయ స్థాయిలో నిలబెట్టారు.
అలాగే బానోతు సుదేష్ణ(రోల్ నెం.28160170) 480/500 మార్కులు సాధించారు. ఇంతటి విజయానికి కారణం క్రమశిక్షణతో కూడిన విద్యా పటిష్టమైన పాఠ్యప్రణాళిక, అంకిత భావం కలిగిన ఉపాధ్యాయ బృందం. ప్రస్తుత పరిస్థితులలో విద్యా వ్యవస్థలో వస్తున్న మార్కులను ఎప్పటికప్పుడు గమనిస్తూ వాటిని ఆచరణ పరుస్తూ ఒత్తిడి లేని వాతావరణంలో, క్రమశిక్షణ సృజనాత్మకతతో కూడిన విద్యను అందిస్తున్నాం.
మా విద్యా సంస్థల్లో పోటీ పరీక్షలను ఎదుర్కొనే విధంగా ఎస్‌ఎస్‌సీ విద్యార్థులకు ఐఐటీ అండ్ మెడికల్ ఫౌండేషన్‌లో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నాం. విద్యార్థులను అన్ని పోటీ పరీక్షలకు సిద్ధం చేయడానికి ఒక బృహత్తరమైన పద్ధతిలో ప్రైమ్ స్కూల్స్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించాం.
ఈ అఖండ విజయాన్ని సాధించి విద్యార్థులను, ప్రోత్సహించిన వారి తల్లిదండ్రులను, అధ్యాపక బృందానికి ఎస్‌ఆర్ విద్యా సంస్థల అధినేత వరదారెడ్డి, డైరెక్టర్లు మధూకర్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంవత్సరం కూడా జేఈఈ(మెయిన్) జాతీయ స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించారు. ఈ ఫలితాలు విద్యార్థులందరికీ స్ఫూర్తిదాయకం కావాలని ఆకాంక్షించారు.






