16 April, 2026 | 3:34 AM

‘ఎస్వీఎం’ విద్యార్థుల ప్రభంజనం

16-04-2026 02:08 AM

ద్భుత ప్రతిభ కనబర్చిన పాఠశాల విద్యార్థులు

ఖమ్మం, ఏప్రిల్ 15 (విజయక్రాంతి): సీబీఎస్‌ఈ బోర్డు వారు ప్రకటించిన 10వ తరగతి పరీక్ష ఫలితాలలో స్థానిక శ్రీనివాస్ నగర్‌లోని ఎస్ వీఎం సెంట్రల్ పబ్లిక్ పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచా రని పాఠశాల డైరెక్టర్ కొండ శ్రీధర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు.పాఠశాల యాజమాన్యం ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల పట్టుదలతో ఈ ఏడాది కూడా 100% ఉత్తీర్ణత సాధించి పాఠశాల తన రికార్డును నిలబెట్టుకుంది.పాఠశాలకు చెందిన వగదాని ఐశ్వర్య 600 మార్కులకు గాను 543 మా ర్కులు, ధారా ధన్యత 533 మార్కులు, మానసవీణ 519 మార్కులు,

వరుని రెడ్డి 487 మార్కులు, గీతిక 485 మార్కులు, పూజిత రెడ్డి  483 మార్కులతో పాటు మిగ తా విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించారని తెలిపారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్  ఉమా కిషోర్, ప్రిన్సిపల్ ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థుల క్రమశిక్షణ ఉపాధ్యాయుల నిరంతర పర్యవేక్షణ వల్లే ఈ విజ యం సాధ్యమైందని కొనియాడారు. విజ యం సాధించిన విద్యార్థులకు, వారికి సహకరించిన తల్లిదండ్రులకు పాఠశాల తరపున ప్రత్యేక అభినందనలు  తెలిపారు.