calender_icon.png 25 November, 2025 | 12:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీ10 లీగ్‌లో శ్రీశాంత్ టీం జోరు

25-11-2025 12:00:48 AM

అబుదాబీ, నవంబర్ 24 : క్రికెట్ ఫాస్టెస్ట్ ఫార్మాట్ అబుదాబీ టీ10 లీగ్‌లో భారత మాజీ క్రికెటర్ శ్రీశాంత్ సారథిగా ఉన్న విస్టా రైడర్స్ వరుస విజయాలతో అదరగొడుతోంది. ఈ సీజన్‌లో మ్యా చ్‌లన్నీ ఉత్కంఠభరితంగా సాగుతూ అభిమానులను అలరిస్తున్నాయి. విస్టా రైడర్స్, ఆస్పి న్ స్టాలిన్స్ మధ్య జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్‌లో శ్రీశాంత్ జట్టు 6 పరుగుల తేడా తో విజయం సాధించింది.

మొదట బ్యాటింగ్‌కు దిగిన విస్టా రైడర్స్ 84 పరుగులు చేసిం ది. ప్రిటోరియస్ 28, డుప్లెసిస్ 13 రన్స్ చేశారు. ఛేజింగ్‌లో ఈజీగా గెలుస్తుందనుకున్న హర్భజన్‌సింగ్ కెప్టెన్సీలోని స్టాలిన్స్ టీమ్ 78 పరుగులకే పరిమితమైంది. ఓపెనింగ్ ఓవర్ వేసిన శ్రీశాంత్ అద్భుతంగా బౌలింగ్ చేసాడు. కేవలం 2 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ సీజన్‌లో విస్టా రైడర్స్‌కు ఇది మూడో విజయం.