calender_icon.png 24 November, 2025 | 10:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రగ్స్ నిర్మూలనకు సహకరించాలి

24-11-2025 10:57:39 PM

రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ దశరథ్..

మీర్‌పేట, పెద్దఅంబర్ పేట ఎక్సైజ్ కార్యాలయాల ప్రారంభం.. 

ఎల్బీనగర్: డ్రగ్స్ రహిత సమాజం నిర్మాణానికి, డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించి, డ్రగ్స్ రహిత సమాజం నిర్మాణానికి కృషి చేయాలని ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కమిషనర్ దశరథ్ పిలుపునిచ్చారు. ప్రోహిబిషన్ & ఎక్సైజ్ శాఖ పునర్వ్యవస్థీకరణలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 14 కొత్త ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సరూర్నగర్, హయత్ నగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లను రెండు భాగాలుగా విభజించి, నూతనంగా మీర్ పేట, పెద్ద అంబర్ పేట ఎక్సైజ్ కార్యాలయాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ దశరథ మాట్లాడారు. ప్రజలకు మరింత చేరువ కావడం, సేవల వేగవంతం, నియంత్రణ చర్యలను బలోపేతం చేయడం దృష్ట్యా కొత్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశామన్నారు. మీర్ పేట్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కు శాశ్వత భవనం ఏర్పాటయ్యేవరకు సరూర్నగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ నుంచే తాత్కాలికంగా కార్యకలాపాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సరూర్ నగర్ డిస్ట్రిక్ట్ ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ఉజ్వల రెడ్డి, మీర్ పేట ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ రెడ్డి, ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.