24-11-2025 11:05:25 PM
మేడ్చల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్
మేడిపల్లి (విజయక్రాంతి): మేడ్చల్ నియోజకవర్గంలోని ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 18వ డివిజన్ లో నిర్మాణమైన ఇందిరమ్మ ఇళ్లను మేడ్చల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ ప్రారంభించి, గృహ ప్రవేశల పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ, ప్రజా పాలనలో అర్హులైన పేదలందరికీ సురక్షితమైన, గౌరవప్రదమైన గృహాలు నిర్మించి ఇవ్వడం, ఇలాంటి పథకాలు నిజంగా అర్హులైన వారికి అందించడం సంతోషకరం అన్నారు.
ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గం బి బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్, ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు తుంగతుర్తి రవి,మాజీ మేయర్ అమర్ సింగ్, మాజీ డిప్యూటీ మేయర్ శివ కుమార్ గౌడ్, జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ ప్రభాకర్ రెడ్డి, మేడ్చల్ జిల్లా మాజీ గ్రంధాలయ చైర్మన్ దర్గా దయాకర్ రెడ్డి, 18 వ వార్డ్ మాజీ కార్పొరేటర్ శాలిని శ్రీకాంత్ గౌడ్, వీరాంజనేయ స్వామి టెంపుల్ చైర్మన్ రామ రెడ్డి,మాజీ కార్పొరేటర్లు ,పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు లబ్ధిదారులు పాల్గొన్నారు.