24-11-2025 11:39:36 PM
హైదరాబాద్ (విజయక్రాంతి): టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్)కు 1,26,085 దరఖాస్తులు వచ్చినట్లు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోలస్ తెలిపారు. సోమవారం సాయంత్రం నాలుగు గంటల వరకు పేపర్-1కు 46,954, పేపర్-2కు 79,131 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో టీచర్లు కూడా ఉన్నారు. దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 29 వరకు గడువుంది. దరఖాస్తులు ఎడిట్ చేసుకునేందుకు ఈనెల 25 నుంచి డిసెంబర్ 1 వరకు అవకాశం కల్పించారు.