17-12-2025 01:34:03 AM
హైదరాబాద్, డిసెంబర్ 16 (విజయక్రాంతి): పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌గా సాంకేతిక విద్యా, కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేనకు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత డైరెక్టర్ నవీన్ నికోలస్ ఈనెల 31 వరకు సెలవుల్లో వెళ్లడంతో ఆమెకు బాధ్యతలు అప్పగించారు.