calender_icon.png 17 December, 2025 | 8:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అస్తవ్యస్తంగా డివిజన్ల విభజన..

17-12-2025 01:33:19 AM

  1. ఎన్ని కుట్రలు చేసినా మేయర్ పీఠం బీజేపీదే.. 

బీజేపీ ఓబీసీ మోర్చా అధికార ప్రతినిధి, మీడియా ఇన్‌చార్జి బీబీఆర్ వేణు

ఎల్బీనగర్, డిసెంబర్ 16 : రానున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు అశాస్త్రీయ పద్ధతిలో కాంగ్రెస్ ప్రభుత్వం అస్తవ్యస్తంగా డివిజన్ల విభజన చేసినప్పటికీ మేయర్ పీఠం బీజేపీకి దక్కుతుందని ఓబీసీ మోర్చా అధికార ప్రతినిధి, మీడియా ఇన్ ఛార్జి బీబీఆర్ వేణు అన్నారు. మంగళవారం ఆర్కే పురం డివిజన్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... గత జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో 48 మంది కార్పొరేటర్లుగా బీజేపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారని గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో పూర్తిస్థాయి మెజార్టీని బిజెపి కైవసం చేసుకుని మేయర్ పీఠం దక్కించుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

ఆశాస్త్రీయంగా డివిజన్లను విభజన చేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి అవమానభారం తప్పదని హెచ్చరించారు.  కామారెడ్డి బీసీ డిక్లరేషన్ 42 శాతం సీట్లు బీసీలకు ఇస్తామన్న హామీ ఎందుకు నెరవేర్చలేదని? ప్రశ్నించారు. మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తే దాన్ని బిజెపి పూర్తిగా వ్యతిరేకిస్తుందన్నారు. రానున్న జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో అవకాశం కల్పిస్తే తప్పనిసరిగా పోటీ చేసి బిజెపి జెండా ఎగరవేస్తానని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.