26-10-2025 04:37:08 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని సోఫీనగర్ కాలనీలో ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత గుండె వ్యాధి నిర్ధారణ శిబిరాన్ని ప్రారంభించారు. వైద్యులు ప్రోమోచంద్రారెడ్డి స్వర్ణ రెడ్డి జగన్నాథం ఆధ్వర్యంలో రోగులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి పొన్నం రాహుల్ గౌడ్ ఆధ్వర్యంలో ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు వైద్య సిబ్బంది ఉన్నారు.