02-01-2026 03:01:38 PM
బెల్లంపల్లి,(విజయ క్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన రేణికుంట్ల శ్రీనివాస్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అసోసియేటెడ్ ట్రెజరరీ గాఎన్నికయ్యారు. ఈమేరకు ఆయన ప్రమాణస్వీకారాన్ని ఆ సంస్థ అంతర్జాతీయ అధ్యక్షులు సిద్ధ సూర్యప్రకాశరావు చేయించారు. శ్రీనివాస్ పదవీ కాలం జనవరి ఒకటో తేదీ నుంచి డిసెంబర్ 30వ తేదీ వరకు ఉంటుంది. ట్రెజరరీ గా నియమితులైనందుకు రేణికుoట్ల శ్రీనివాస్ వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. తన బాధ్యతలను నిజాయితీగా, సంస్థ ఆర్థిక అభివృద్ధి కోసం నిర్వహిస్తాన్నారు.