02-01-2026 04:34:32 PM
వాంకిడి,(విజయక్రాంతి): వాంకిడి మండలంలోని కనర్గాం గ్రామంలో శనివారం మహాత్మా జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలేల విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు గ్రామ మాలీ కులసంఘం నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలను వారు ఆహ్వానించారు.
ఈ సందర్భంగా శుక్రవారం వాంకిడి మండల కేంద్రంలో ఎస్సై మహేందర్‌ను, అలాగే కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గుర్నులే నారాయణలను మర్యాదపూర్వకంగా కలిసి విగ్రహావిష్కరణ ఆహ్వాన పత్రికను అందజేశారు. సామాజిక సంస్కరణలకు చిరునామాలైన మహాత్మా జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలే ఆదర్శాలను యువతకు చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ విగ్రహాలను ప్రతిష్టిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వివిధ కుల సంఘాల నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కులసంఘం నాయకులు కోరారు.