calender_icon.png 2 January, 2026 | 6:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎంని కలిసిన యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు

02-01-2026 04:23:31 PM

హుజురాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కరీంనగర్ జిల్లా హుజరాబాద్ కి చెందిన తెలంగాణ ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అడ్వకేట్ యేసుపాదం థామస్ శుక్రవారం  నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన యువ నాయకుడు యేసుపాదం థామస్, గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు, హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు తిరిగి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ పటిష్టతకు యువత పోషించాల్సిన పాత్రపై ఈ భేటీలో క్లుప్తంగా చర్చించినట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు శివ చరణ్ రెడ్డి తో పాటు ఇతర కాంగ్రెస్ నాయకులు కూడా పాల్గొన్నారు.