మెయిన్ రోడ్డుపై సిసి రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలి
బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య
తుంగతుర్తి,(విజయక్రాంతి): గత కొంతకాలంగా తుంగతుర్తి మెయిన్ రోడ్డుపై సిసి రోడ్డు నిర్మాణం పనులు చేపట్టకపోవడంతో ప్రజలు కష్టాల పాలవుతున్నారని తక్షణమే ఆర్ అండ్ బి అధికారులు, కాంట్రాక్టర్లు స్పందించి రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని బాబు ఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ప్రభుత్వ దావాఖాన ఎదురుగా కోరుతూ బీఆర్ఎస్ శ్రేణుల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి మాట్లాడారు.
సదరు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో వాహనదారులకు ప్రమాదాలు మరొక ప్రక్క రోగాలు బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే రాష్ట్ర రోడ్డు భవన శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు స్పందించి, సిసి రోడ్ నిర్మాణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు గుండ గాని రాములు గౌడ్, కేతిరెడ్డి గోపాల్ రెడ్డి, రావులపల్లి సర్పంచ్ చింతకుంట్ల మనోజ్, గోపగాని రమేష్ గౌడ్, తడక మల్ల రవికుమార్, బొజ్జ కిరణ్, వెంకన్న గౌడ్, స్థానికులు పాల్గొన్నారు.






