02-01-2026 04:37:16 PM
మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): కాగజ్ నగర్ మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే ను కలసిన ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కాగజ్ నగర్ మున్సిపల్ కార్మికుల సమస్యలు తీర్చాలని వినతిపత్రం అందజేశారు. మున్సిపల్ కార్మికుల సమ్మె వల్ల పట్టణం చెత్తాచెదారంతో నిండిపోయిందని, అంటు రోగాలు వ్యాపించే ప్రమాదం ఉందని, త్రాగునీటికి ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు.
కలెక్టర్ దృష్టికి కోనప్ప తీసుకువెళ్లారు. వెంటనే మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి సమ్మెను విరమింప చేయుటకు కృషి చేస్తామని వారి పెండింగ్ జీతాలు, ఈఎస్ఐ బకాయిలు చెల్లిస్తామని జిల్లా కలెక్టర్ హామీ హామీ ఇచ్చినట్లు కోనప్ప తెలిపారు. ఆయన వెంట బిఆర్ఎస్ ట్రేడ్ యూనియన్ విభాగం జిల్లా నాయకులు అంబాల ఓదెలు ఉన్నారు.