02-01-2026 04:31:04 PM
మంచిర్యాల,(విజయక్రాంతి): పురగిరి క్షత్రియ పెరిక సంఘం మంచిర్యాల పట్టణ అద్యక్షునిగా బొడ్డు తిరుపతి ఎన్నికయ్యారు. శుక్ర వారం కార్పొరేషన్ పరిధిలోని వేంపల్లి మంచిర్యాల గార్డెన్స్ లో పట్టణ కార్యవర్గ ఎన్నిక నిర్వహించారు. జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బొడ్డు శంకర్, చుంచు రాజ్ కిరణ్ ల ఆధ్వర్యంలో జరిగిన మంచిర్యాల పట్టణ ఎన్నికల్లో అధ్యక్షునిగా బొడ్డు తిరుపతి, ప్రధాన కార్యదర్శిగా బియ్యాల సత్తయ్య, గౌరవ అధ్యక్షునిగా కార్కురి చంద్రమౌళిలు ఎన్నికయ్యారు. పెరిక సంఘం బలోపేతానికి కృషి చేస్తామని నూతనంగా ఎన్నికైన సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు పెట్టం లక్ష్మణ్, ఆత్మ చైర్మన్ సింగతి మురళీ, అత్తి సరోజ, ట్రస్ట్ చైర్మన్ బియ్యాల లక్ష్మణ్, వడ్డే రాజమౌళి, మోటపల్కుల తిరుపతి, రఘునందన్ తదితరులు పాల్గొన్నారు.